Free Vaccination and Blood Donation Camp
చెర్లపల్లి న్యూస్ :
తెలంగాణ చేపట్టిన 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవం భాగంగా .. Dr .కే. గోవిందా రెడ్డి అధ్యరంలో ఏర్పాటు చేసిన ఫ్రీ వాక్సినేషన్ మరియు బ్లోడ్ డొనేషన్ క్యాంపు కి చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ (ఫసె – 1 ,2 ,౩) ,చెర్లపల్లి నోటిఫీడ్ మునిసిపల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ , లయన్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఇండస్ట్రియలిస్ట్ మరియు లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ గోల్డెన్ జూబిలీ తో పటు ప్రైమరీ హెల్త్ సెంటర్ చెర్లపల్లి తో కలిశి క్యాంపును ఏర్పాటు చేసారు. ఈ క్యాంపు కు చెర్లపల్లి ఇండస్ట్రియల్ లో పనిచేసే వర్కర్లు మరియు యజమానులు కూడా కలిసి ఫ్రీ వాక్సినేషన్ అండ్ బూస్టర్ డోస్ ను ఉపయోగించుకున్నారు. దాదాపుగా 700 కి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాక్సినేషన్ తీసుకున్నారు , 100 కి పైగా ఫ్రీ బ్లడ్ డొనేషన్ కూడా చేసారు . వాక్సినేషన్ మరియు బూస్టర్ డోస్ తీసుకున్న వారికీ ఎలాంటి ఇబ్బంది కలగాకుండా సర్టిఫికెట్ లను కూడా అప్పుడే అందే విదంగా వారు దగ్గర ఉండి చూసుకున్నారు. Dr . కే. గోవిందా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చేపట్టిన 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవం భాగంగా చెర్లపల్లి లో పనిచేసే వర్కర్లకు మల్లి వాక్సినేషన్ క్యాంపు మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాను అని చెప్పారు. ఈ క్యాంపులో భాగంగా జక్కా రోశి రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, రమేష్ కృష్ణ ,వెంకటేశ్వర రెడ్డి ,పీస్ మోహన్,ch v రాము, రమేష్ కృష్ణ , గంగాధర్ బాబు, చక్రపాణి రెడ్డి, వెంకటరత్నం ,కేబిన్ గుప్తా పారిశ్రామికవేత్తలు , అసోసియేషన్ సిబ్బంది మరియు డాక్టర్స్ పాల్గొన్నారు.