Kantivelugu Programme Feb 2023
ప్రెస్ రిపోర్ట్
చెర్లపల్లి న్యూస్ :
చర్లపల్లి పారిశ్రామికవాడలో కంటి వెలుగు కేంద్రంను ప్రారంభించిన ఐలా చైర్మన్, జోనల్ కమిషనర్
అంధత్వ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని కార్మికులు కంటి వెలుగు పధకంను సద్వీనియోగం చేసుకోవాలని చర్లపల్లి ఐలా చైర్మన్ జక్క రోషిరెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సిఐఎ అడిటోరియంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రంను TSIIC జోనల్ మేనేజర్ మాధవి, చర్లపల్లి ఐలా కమిషనర్ ఉమమహేశ్వర్ తో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు పధకాన్ని కార్మికులు, పరిశ్రమ యాజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు కంటి సమస్యతో బాధపడకుండ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా కంటి వెలుగు పధకాన్ని ప్రారంభించారని అన్నారు. ఉచితంగా కంటికి సంభదించి అన్ని పరీక్షలు చేసి అవసరమైనవారికి అద్దాలు, కంటి ఆపరేషన్ను రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తున్నదని తెలిపారు. కంటి పరీక్షల కోసం వచ్చే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
తొలి రోజు 375 కార్మికుల CHECKUP అయింది.
ఈకార్యక్రమంలో సిఐఎ అధ్యక్షుడు Govind Reddy, ఐలా కార్యదర్శి అంబటి వేంకటేశ్వర్రెడ్డి, కోషాధికారి వెంకట్రాంరెడ్డి, విశ్వేశ్వర్రావు, సిఐఎ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కెకె రాజు, హనుమాన్ ప్రసాద్, రఘు, వర ప్రసాద్, కిశోర్, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply