MSME Sustainable (ZED) Certification Scheme Awareness Programme
చర్లపల్లి న్యూస్:
సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమల రంగం లో జెడ్ సర్టిఫికెట్ కొత్త ఉత్పత్తుల ప్రక్రియ , మార్కెట్ ను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని msme అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ. సుధీర్ కుమార్ గారు పేర్కొన్నారు . చర్లపల్లి పారిశ్రామిక వడ భవనం లో గురువారం సాయంత్రం పారిశ్రామికవేత్తల సంఘం ప్రెసిడెంట్ Dr .కే.గోవిందా రెడ్డి అధ్యక్షతన msme మంత్రిత్వ శాఖ అధ్యరంలో జీరో ఎఫెక్ట్ ,జీరో డిఫెక్ట్ (ZED ) పై పారిశ్రామికుల వేత్తలకు అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదం తో పారిశ్రమిక రంగం లో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని , ముఖ్యంగా జెడ్ సర్టిఫికెట్ తో డెఫన్స్ ,పీఎస్ యు ,బ్యాంకింగ్ ,DRDO , ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసిన ఉత్పత్తులను సరఫరా చేయవచ్చని చెప్పారు . జెడ్ కోఆర్డినేటర్ శ్రీ.నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలకు ఉద్యోగ్ ఆధార్ సంఖ్యా తప్పక ఉండాలని వాటి సంఖ్యా ద్యారా జెడ్ సర్టిఫికెట్ పొందవచ్చని పవర్ పాయింట్ ద్యారా అవగాహనా కల్పించారు . ఈ కార్యక్రమములో ఐలా చైర్మన్ జక్కా రిసిరెడ్డి ,వెంకటరత్నం ,చంద్ర శేఖర్ రెడ్డి, SRC రెడ్డి ,వినోద్ కుమార్, గందాధర్ బాబు ,దత్త,సురేష్ శ్రీనివాసులతో పాటు పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వెతలు పాల్గొన్నారు.
Leave a Reply