Seminar on Export Awareness Workshop for Entrepreneurs
చెర్లపల్లి న్యూస్ :
పారిశ్రామిక వేత్తలు వారు ఉత్పత్తి చేసిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు ఎలా పొందాలనే విషయం పైన చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజషన్ వాళ్ళతో కలిసి ” ఇండియాన్ ఇంపోర్ట్ అండ్ ఎక్సపోర్ట్ పైన సెమినార్ కండక్ట్ చేయడం జరిగేది .ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజషన్ అస్సిటెంట్ డైరెక్టర్ రఘునాధ బాబు ముఖ్య అతిధిగా పాల్గిని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో డైరెక్ట్ గ లైవ్ లో వివరించారు. రఘునాధ బాబు మాట్లాడుతూ కొత్తగా ఉన్న మరియు పాతగా ఉన్న పాలసీల పైన ఏవిదంగా ఎక్స్పోర్ట్ /ఇంపోర్ట్ చేయాలో సలహాలు సూచనలు ఇచ్చారు. మరియు శ్రీ సి ఏ వెంకట ప్రసాద్ , CA అఫ్ హరేగంగా అసోసియేట్ డైరెక్టర్ కూడా పాల్గొని వారికీ తగు సూచనలు ఇచ్చారు. చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Dr .కే. గోవిందా రెడ్డి గారు మాట్లాడుతూ చెర్లపల్లి లో ఉన్నపరిశ్రమలు ఉత్పత్తి చేసిన వాటిని విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ /ఇంపోర్ట్ చేయాలో వాటి పైన యువ పారిశ్రామిక వెతలు ట్రైనింగ్ తీసుకోవచ్చునని చెప్పారు. చెర్లపల్లి లో తరచుగా ఎదురు కొంటున్న సమస్యలను గవర్నమెంట్ /సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ లతో మాట్లాడి ప్రతి నెల మన అసోసియేషన్ ఆఫీస్ కె వచ్చే వేదంగా నేను కృషి చేస్తా అన్నారు . అదేవిధంగా వచ్చే నెలలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పైన ట్రినింగ్ ప్రోగ్రామ్ ను కూడా చెలపల్లి అసోసియేషన్ ప్రాంగణం లో కండక్ట్ చేస్తామన్నారు. ఇది ఒక సెమినార్ మాత్రమే వచ్చే నెలలో చేసే ట్రినింగ్పూ ప్రోగ్రామ్ర్ కి అందరు ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు . ఈ కార్యక్రమములో గోవిందా రెడ్డి ,చంద్ర శేఖర్ రెడ్డి, రోసి రెడ్డి ,వెంకట రత్నం ,వెంకటేశ్వర రెడ్డి , మూర్తి ,మోహన్,విశ్వేశ్వర రావు ,SRC రెడ్డి ,వినోద్ కుమార్, ప్రసాద్ ,రమేష్ కృష్ణ , ఆఫీస్ సిబంది తదితరులు పాల్గొన్నారు .
Leave a Reply